China: చైనాలో మరో కొత్త సబ్-వేరియంట్‌‌.. రికార్డు స్థాయిలో కేసులు..

China: చైనాలో మరో కొత్త సబ్-వేరియంట్‌‌.. రికార్డు స్థాయిలో కేసులు..
China: గతంలో ఎన్నడూలేని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

China: కరోనా కొత్త వేరియంట్లు చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో కొత్తకేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 13వేలకుపైగా కొత్తకేసుల నమోదు గుబులు రేపుతోంది. ఇప్పటికే స్టెల్త్-ఒమిక్రాన్‌తో విలవిలలాడుతున్న చైనాలో మరో వేరియంట్‌ను గుర్తించారు. షాంఘై సమీపంలో ఒమిక్రాన్‌‌కు చెందిన కొత్త వేరియంట్‌ వెలుగుచూసినట్లు చైనా అధికారిక పత్రిక స్పష్టం చేసింది.

ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఆంక్షలను చైనా కఠినంగా అమలు చేస్తున్నా....కేసులు తగ్గక పోవటం కలవర పెడుతోంది. షాంఘై సమీపంలో దలియన్ నగరంలో ఓ వ్యక్తి రక్త నమూనాల జన్యువిశ్లేషణలో... స్టెల్త్ ఒమిక్రాన్‌కు భిన్నమైన వేరియంట్‌ బయటపడింది. చైనాలో కరోనా వైరస్‌కు కారణమైనదానితో ఈ కొత్త వేరియంట్‌ సరిపోలడం లేదని నివేదిక చెబుతున్నాయి.

అటు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొత్తగా తొమ్మిది వేల కేసులు వెలుగుచూశాయి. వీటిలో 8వేల వరకు అసింప్టమాటిక్ కేసులుగా తేల్చారు. కేసుల ఉధృతి దృష్ట్యా షాంఘైలో మళ్లీ మరో దశ మాస్ టెస్టింగ్‌ కోసం చర్యలు చేపట్టారు. మరోవైపు హైనన్ ప్రావిన్సుల్లోని సాన్యా నగరంలో కొత్తకేసులతో ప్రజా రవాణాను నిలిపి వేశారు.

కేసులు పెరుగుతుండటంతో రాజధాని బీజింగ్‌లో పాక్షిక లాక్‌డౌన్లతోపాటు ప్రయాణాలపై నిషేధం కొనసాగుతోంది. అటు కరోనా బారినపడ్డ చిన్నారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన చిన్నారులను తల్లిదండ్రుల నుంచి బలవతంగా వేరుచేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story