Shanghai: ఆ దేశంలో జంటలు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం నిషేధం..

Shanghai: కోవిడ్ పుట్టిన దేశమైన చైనాలో మళ్లీ కేసుల విజృంభణ పెరిగింది. అందుకే కఠినంగా లాక్‌డైన్ అమలు చేసే పనిలో పడింది చైనా ప్రభుత్వం. ముఖ్యంగా చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో లాక్‌డౌన్‌ను కఠినమైన రూల్స్‌తో ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఆ రూల్స్ విని ఆశ్చర్యపోతున్నారు షాంఘై ప్రజలు.
కోవిడ్ వ్యాపించకుండా అన్ని లాక్‌డౌన్ రూల్స్ అమలు అవుతున్నాయో లేదో అని చైనా ప్రభుత్వం డ్రోన్‌లతో చెక్ చేస్తోంది. కనీసం కిటికీలు కూడా తెరవకూడదని ప్రజలపై ఆంక్షలు విధించారు. దీంతో షాంఘైలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నిబంధనల వల్ల వారు చాలా కఠినమైన జీవితాన్ని గడుపుతున్నట్టు అంటున్నారు.
ఆ లాక్‌డౌన్ సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జంటలు కూడా కలిసి నిద్రించకూడదని, కౌగిలింతలు, ముద్దులు కూడా పెట్టుకోవద్దని చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇళ్లల్లో కూడా ఎవరికి వారు దూరంగానే ఉండాలని తెలిపింది. ఎప్పటికప్పుడు కార్యకర్తలు ఆరోగ్య ప్రకటనలు చేస్తూ షాంఘై వీధుల్లో తిరుగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com