Pakistan: పాకిస్థాన్‌లో భీకర వరదలు.. దాదాపు 500 మందికి పైగా మృతి..

Pakistan: పాకిస్థాన్‌లో భీకర వరదలు.. దాదాపు 500 మందికి పైగా మృతి..
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. భీకర వరదలతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది.

Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. భీకర వరదలతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. రోడ్లు, వీధులు వరదలతో హడలెత్తిపోతున్నాయి. అరేబియా సముద్రం తీరం వెంబడి ఉన్న పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీని ప్రతి సంవత్సరం వరదలు వణికిస్తాయి. కొన్నేళ్లుగా వరదల తెచ్చే బాధలను కరాచీ జనాలు అనుభవిస్తున్నారు. తాజా వరదల బీభత్సానికి అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సింధ్ ప్రకారం.. ఆగస్టు 1 నాటికి వరదల భయానికి కరాచీలోనే ఈ ఏడాది 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

రుతుపవనాల వర్షాలు పాకిస్థాన్ అంతటా విధ్వంసం సృష్టించాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాజా నివేదిక ప్రకారం.. గత ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా 500 మందికి పైగా మరణాలు సంభవించాయి. హైవేలు, రోడ్లు, వంతెనలు ధ్వంసంమయ్యాయి. 39వేల గృహాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది పాకిస్థాన్‌లో సగటు వర్షపాతం కంటే 87శాతం అధికంగా నమోదైందని మంత్రి షెర్రీ రెహ్మాన్ వెల్లడించారు. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాతావరణ-హానీ కలిగించే దేశాలలో పాకిస్థాన్ కూడా చేరిపోయింది.

వరద సహాయక చర్యలు చేపడుతున్న బలూచిస్థాన్‌లో దారుణం జరిగింది. సోమవారం రాత్రి అదృశ్యమైన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఉన్న ఆరుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మూసా గోత్, విందార్, లాస్బెలాలో వరద సహాయక చర్యల్లో ఉండగా ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. పాక్ ఆర్మీ జవాన్ల మృతి పట్ల దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. వరద ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు ఇరాన్‌లోనూ ఇదే పరిస్థితి అదే దుస్థితి. వరదల కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది చనిపోయారు. 200 మందికి పైగా తప్పిపోయినట్లు స్థానికులు చెప్పారు. గత వారం రాజధాని టెహ్రాన్‌లో కొండచరియలు విరిగిపడటం, బురదపాతం కారణంగా కనీసం 200 మంది అదృశ్యమయ్యారు. వీధుల్లో పేరుకపోయిన బురదల్లో శరీర భాగాలు బయటపడుతున్నాయి. వరద హెచ్చరికలను ముందస్తుగానే జారీ చేస్తే ఈ మేర నష్టం ఉండేదికాదని షార్గ్ వెల్లడించాయి. బుధవారం నాటికి ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో భారీ వర్షాలు పడ్డాయి. 20వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story