New York: న్యూయార్క్‌లోని భారీ అగ్ని ప్రమాదం.. 12 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మంటలు.. 19 మంది మృతి..

X
New York: అమెరికా న్యూయార్క్‌లోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 12 అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 200 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అపార్ట్‌మెంట్‌లోని రెండో,మూడో అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించి..మిగతా ఫ్లోర్లకు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. బాధితుల్లో చాలా మంది పోగపీల్చడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన అతి పెద్ద రెసిడెన్షియల్ ఫైర్ యాక్సిడెంట్ ఇదే అని చెప్తున్నారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
