Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 35మంది సజీవదహనం.. 450 మందికి గాయాలు..

X
Bangladesh: బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 35మంది సజీవదహనం అయ్యారు. మరో 450 మందికి గాయాలయ్యాయి. చిట్టగాంగ్ సీతకుంటలోని ప్రైవేటు కంటైనర్ డిపోలో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. రసాయనాల వల్లే భారీగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిన్న రాత్రి మంటలు చెలరేగగా, అర్ధరాత్రి సమయంలో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
