Russia: రష్యాలో భారీ అగ్నిప్రమాదం.. ఉక్రెయినే చేసిందా..? లేదా..?

Russia: రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తోందా? ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా ఆయిల్ డిపోలు మంటల్లో చిక్కుకోవడమేంటి? రష్యా బ్రయాన్స్క్‌లోని డీజిల్ డిపోపై రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. చూస్తుంటే ఆయిల్ డిపోపై దాడి జరిగినట్టుగానే కనిపిస్తోంది. పైగా రష్యా-ఉక్రెయిన్ వార్‌లో భాగంగా రష్యా సేనలను అడ్డుకోవడమే కాదు.. అప్పుడప్పుడు దాడులు కూడా చేస్తోంది ఉక్రెయిన్.
పైగా బ్రయాన్స్క్ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. రష్యా నుంచి యూరప్ దేశాలకు ఇంధనాన్ని రవాణా చేసే మెయిన్ పైప్‌లైన్లు ఈ ప్రమాద ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నాయి. బ్రయాన్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్‌కు చెందిన హెలికాప్టర్లు దాడులు చేస్తున్నాయని గతవారమే రష్యా ఆరోపించింది. దీంతో ఉక్రెయిన్‌నే ఈ దాడి చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తామే దాడి చేశామని అటు ఉక్రెయిన్ గాని, దాడి జరగలేదని అటు రష్యా గాని చేయలేదు. డీజిల్ డిపోలో మంటలు చెలరేగినట్టుగానే.. గతవారం రష్యా మిలటరీ రీసెర్చ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఇప్పుడు ఆయిల్ డిపోలో ఉన్నట్టుండి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాని, ఈ రెండు ఘటనలనూ ఇరు దేశాలు యుద్ధంతో ముడిపెట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com