Ukraine Russia: 'ఉక్రెయిన్‌పై సైనిక దాడులు వెంటనే ఆపండి'.. అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశం

Ukraine Russia: ఉక్రెయిన్‌పై సైనిక దాడులు వెంటనే ఆపండి.. అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశం
Ukraine Russia: ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ukraine Russia: ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఉక్రెయిన్‌పై సైనిక దాడులను వెంటనే ఆపాలని సూచించింది. ఆ దేశ భూ భాగం నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గాని...ఆ దేశానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించింది.

ఐతే ఐసీజే సూచనలను రష్యా పట్టించుకుందా..లేదా అనే దానిపై అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడులను ఆపాలంటూ రెండు వారాల క్రితం ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఉక్రెయిన్‌. 1948 నాటి నిబంధనలు ఉల్లంఘించి రష్యా తమ దేశంపై దాడులకు పాల్పడుతోందని వాదనలు వినిపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని రష్యాను నిలువరించాలని ఐసీజేను కోరింది ఉక్రెయిన్‌.

వాయిస్: రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో ఉక్రెయిన్‌ విజయం సాధించిందన్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ. దాడులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐసీజే ఇచ్చిన తీర్పుకి రష్యా కట్టుబడి ఉండాలని కోరారు. ఈ తీర్పును ఉల్లంఘిస్తే రష్యా మరింత ఒంటరిగా మారడం ఖాయమన్నారు.

ఇక రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మూడు వారాలకు చేరిన వేళ బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అమెరికా, రష్యా మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సులివాన్‌...రష్యా సెక్యూరిటి కౌన్సిల్ సెక్రటరీ నొకోలాయ్ పట్రుషవ్‌తో భేటీ అయినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమావేశంలో జాక్ పునరుద్ఘాటించారని స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో రష్యా సీరియస్‌గా ఉంటే ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలపై దాడులను వెంటనే మానుకోవాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story