Imran Khan: భారత్‌పై మరోసారి పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..

Imran Khan: భారత్‌పై మరోసారి పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..
Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు పశ్చిమ దేశాలు నిందించిన సమయంలో భారత్‌ అనుసరించిన విదేశాంగ విధానాన్ని కొనియాడారు. లాహోర్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ గతంలో మాట్లాడిన వీడియోను ప్లే చేసి మరీ వినిపించారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ సమయంలో రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేయొద్దంటూ అమెరికా ఒత్తిడిని భారత్ దీటుగా ఎదుర్కుందని ప్రశంసించాడు. రష్యా నుంచి చమురుకొనుగోలు విషయంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందని మండిపడ్డారు. ''చౌకగా చమురు కొనుగోలు కోసం రష్యాతో తాము చర్చించామన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి అమెరికా ఒత్తిళ్లను ఎదురించే ధైర్యంలేదన్నారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. ఇలాంటి బానిసత్వానికి నేను వ్యతిరేకిని'' అంటూ పాకిస్థాన్‌ సర్కార్‌ వైఖరిపై మండిపడ్డారు.

Tags

Next Story