Ukraine Russia: ఖర్కీవ్‌లో బందీలుగా 3189 మంది భారతీయులు..

Ukraine Russia: ఖర్కీవ్‌లో బందీలుగా 3189 మంది భారతీయులు..
Ukraine Russia: ఉక్రెయిన్‌లోని పలు దేశాల పౌరులను బందీలుగా పట్టుకున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తోంది.

Ukraine Russia: ఉక్రెయిన్‌లోని పలు దేశాల పౌరులను బందీలుగా పట్టుకున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్య సమితి మాస్కో రాయబారి ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ వాసులు.. వేలమంది విదేశీయులను బందించారని చెప్పుకొచ్చారు. ఖర్కీవ్‌లో 3వేల 189 మంది భారతీయులు, 2700 మంది వియత్నాం వాసులు, 202 మంది చైనీయులను బందించారని, సుమీలో 576 మంది భారతీయులను, 101 మంది ఘనా దేశస్తులు, 121 మంది చైనీయులను, చెర్నిహివ్‌లో 9 మంది ఇండోనేషియన్లు బందీలుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

రష్యాపై ఆయా దేశాలు ఒత్తిడి పెంచేందుకే ఉక్రెయిన్‌ వాసులు ఇలా చేశారా.. లేక ఉక్రెయిన్‌పై దాడుల ఉధృతిని పెంచేందుకు రష్యానే ఇలాంటి వార్త సృష్టించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బందీలుగా ఉన్న ఆయా దేశాల పౌరులను రక్షిస్తామన్న పేరుతో రష్యా దూకుడు పెంచినా పెంచొచ్చు. అయితే, ఇప్పటి వరకు ఏ దేశం కూడా తమ పౌరులు బందీలుగా ఉన్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

ఓవైపు ప్రత్యర్థి బలగాలను ప్రతిఘటిస్తూనే.. రష్యాతో చర్చలకు సిద్ధమవుతోంది ఉక్రెయిన్‌. రెండు రోజుల్లో చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు ప్రకటించారు. యుద్ధం మొదలైన తరువాత ఉక్రెయిన్‌-రష్యా మధ్య రెండుసార్లు చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయ్యాయి. మూడోసారి జరిగే చర్చల్లో అయినా సానుకూల నిర్ణయం రావాలని ఆశిస్తున్నారు ఉక్రెయిన్ వాసులు.

మరోవైపు ఉక్రెయిన్​సరిహద్దు దేశాల పర్యటనకు అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్ రెడీ అవుతున్నారు. వచ్చే వారం పోలండ్​, రొమేనియాలకు వెళ్లనున్నారు. మార్చి 9 నుంచి 11వ తేదీ మధ్య పోలండ్, రొమేనియాలో పర్యటిస్తారు. రష్యా యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల మధ్య కమలా హారిస్​పర్యటించడం ఆసక్తి రేపుతోంది. నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకే కమలా హారిస్‌ పర్యటన ఉద్దేశమని చెబుతున్నారు.

ఉక్రెయిన్‌కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నట్లు తెలిపారు. మరోవైపు రష్యా మాత్రం దూకుడు తగ్గించడం లేదు. కీవ్‌ సహా కీలక నగరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఖర్కీవ్‌లోని నివాస ప్రాంతాలపై రష్యా వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తోంది.

ఈ తెల్లవారుజామున కూడా ఖార్కీవ్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో సాధారణ పౌరులంతా బంకర్లలోకి వెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని అణువిద్యుత్‌ ప్లాంట్లే లక్ష్యంగా రష్యా దూకుడుగా వెళ్తోంది. జప్రోజియా అణువిద్యుత్‌ కేంద్రాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. డికాన్వేవ్‌స్కీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌పైనా దాడులకు పాల్పడింది.

ఇప్పటికే చెర్నోబిల్‌ను కూడా రష్యా తన వశం చేసుకుంది. రష్యా దూకుడు పగ్గాలు వేస్తోంది ఉక్రెయిన్. నాటో దేశాల సాయంతో ఎదురుదాడి చేస్తోంది. ఒక్కరోజే రష్యాకు చెందిన మూడు su-25 జెట్ ఫైటర్స్‌ను నేలకూల్చింది ఉక్రెయిన్‌ సేన. మరోవైపు రష్యాపై ఆంక్షల సెగ తగులుతూనే ఉంది. రష్యాకు ఎలక్ట్రానిక్స్ పరికరాల సరఫరా నిలిపివస్తున్నట్టు ప్రకటించింది సామ్​సంగ్​కంపెనీ.

Tags

Read MoreRead Less
Next Story