Israel: వింత వ్యాధి..! మెదడును తినేసే పురుగు వల్ల వ్యక్తి మృతి..

Israel: వింత వ్యాధి..! మెదడును తినేసే పురుగు వల్ల వ్యక్తి మృతి..
Israel: మెదడుకు వచ్చే ట్యూమర్‌లాంటి సమస్యల గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ వ్యాధే పామ్.

Israel: ఈరోజుల్లో పీల్చే గాలి దగ్గర నుండి తినే ఆహారం వరకు ఏదీ సురక్షితం కాదు. అందుకే ఎవరి ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎవరు ఎప్పుడు అనారోగ్యానికి గురవుతారో చెప్పలేకపోతున్నాం. పైగా డాక్టర్లకు అంతుచిక్కని ఎన్నో ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పుట్టుకొస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వింత వ్యాధితోనే 36 ఏళ్ల వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

మెదడుకు వచ్చే ట్యూమర్‌లాంటి సమస్యల గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ వ్యాధే పామ్ (ప్రైమరీ అమీబిక్ మెనింగోయెన్సెఫాలిటీస్). దీనిని మామూలుగా మెదడుకు వచ్చే ఓ ఇన్ఫెక్షన్ అని కూడా అనవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌లో నెగ్లేరియా ఫాలరీ అనే ఓ అమీబా మెదడును కొంచెంకొంచెంగా తినేస్తుంది. దానివల్లే ఇజ్రాయెల్‌లోని ఓ వ్యక్తి మృతిచెందాడు.

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎవరికీ రాలేదు. ప్రాథమిక పరీక్షల వల్ల ఆ వ్యక్తి పామ్‌తోనే చనిపోయాడని నిర్ధారించినా.. పూర్తిగా నిర్ధారణకు రావడం కోసం తన శాంపుల్స్‌ను అమెరికాకు పంపించింది ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ. తలనొప్పి, జ్వారం, వాంతులు, విరోచనాలు లాంటివి పామ్ యొక్క లక్షణాలని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత తొమ్మిది రోజుల్లోనే పెరుగుతుందట. అప్పుడు వ్యక్తికి ఫిట్స్, గొంతుపట్టేయడం, భ్రమలాంటివి మొదలవుతాయని వారు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story