Muzaffar Kayasan: ఆ వ్యక్తి శరీరం నుండి కరోనా పోవడం అసాధ్యం..! ప్రపంచంలోనే ఫస్ట్ కేసు..

Muzaffar Kayasan: కరోనా అనే మహమ్మరి ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా ప్రభావం చూపిస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో చాలామంది కరోనా బారిన పడినా ప్రాణాలతో బయటపడగలిగారు. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
కరోనా సోకిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు త్వరగా కోలుకున్నారు. అలా లేనివారికి కాస్త సమయం పట్టింది. అందులో కొందరు మాత్రం కరోనాతో పోరాడలేక ప్రాణాలు విడిచారు. అలా ఒక్కొక్క మనిషి శరీరాన్ని బట్టి వారిపై కరోనా ప్రభావం చూపించింది. అయితే టర్కీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా అనేది కామన్ అయిపోయింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా 78 సార్లు అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందట.
టర్కీకి చెందిన ముజఫర్ కయాసన్‌కి 56 ఏళ్లు. అతడికి 2020 నవంబర్‌లో తొలిసారి కరోనా సోకింది. అప్పుడే తాను ఆసుపత్రిలో చేరాడు. కొన్నిరోజులకు తాను కరోనా నుండి కోలుకున్నట్టు అనిపించి వైద్యులు తనకు పరీక్షలు చేశారు. కానీ రిజల్ట్ మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. అలా ఏకంగా 78 సార్లు తనకు రిజల్ట్ పాజిటివ్ అనే వచ్చింది.
ఎంత ప్రయత్నించిన కరోనా నుండి బయటపడకపోవడంతో.. కయాసస్‌కు అన్ని రకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. అప్పుడే తాను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం బయటపడింది. దీని వల్ల శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోవడంతో తన శరీరం నుండి కరోనాను పూర్తిగా తీసేయడం కష్టం అంటున్నారు వైద్యులు. కరోనా వల్ల తాను 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. ఇలాంటి పర్మనెంట్ కరోనా కేసు ప్రపంచంలోనే ఇది మొదటిది అంటున్నారు డాక్టర్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com