Omicron BA.2: కరోనా నుండి కొత్త సబ్ వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్‌గా..

Omicron BA.2: ముందుగా 2020లో కరోనా అనే ఒక మహమ్మరి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికించింది. ఇప్పటికీ చాలామంది ప్రాణాలను బలిదీసుకుంటూ ఈ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. కరోనా అనేది ఇప్పటికీ ఎన్నో రూపాల్లో చాలామంది మరణాలకు కారణమయ్యింది. తాజాగా కరోనా నుండి మరో సబ్ వేరియంట్ వచ్చినట్టు వైద్యులు చెప్తున్నారు.
కరోనా నుండి ఇప్పటికీ ఎన్నో వేరియంట్లు బయటికి వచ్చాయి. ముందుగా డెల్టా వేరియంట్ వచ్చినా.. దాని వ్యాప్తి అంత వేగంగా ఉండకపోవడంతో ప్రజలు దానిని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ అనే వేరియంట్ మాత్రం కొన్నిరోజుల్లోనే చాలామంది ప్రజలకు వ్యాపించి మరోసారి అందరిని కలవరపెట్టింది. తాజాగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను కనుగొన్నామని వైద్యులు అంటున్నారు.
ఒమిక్రాన్‌లో వ్యాప్తి వేగవంతంగా ఉంటుందని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. కానీ దానికంటే ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తుందని వారు అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 57 దేశాల్లో ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్‌ను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేరియంట్ బయటపడుతుంటే.. ఈ కరోనా అనేది పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com