Ethiopia: ఇథియోపియాలో మారణహోమం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో 200 మంది మృతి..

Ethiopia: ఇథియోపియా మరోసారి రక్తసిక్తమైంది. జాతుల ఘర్షణతో అట్టుడికింది. తిరుగుబాటుదారుల దాడుల్లో అమ్హరా తెగకు చెందిన 230 మంది చనిపోయారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ నరమేథానికి.. ఒరోమో లిబరేషన్ ఆర్మీనే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇది అత్యంత హేయమైన దాడిగా చెబుతున్నారు. మృతదేహాలను ఒకే సారి ఒకే చోట ఖననం చేస్తుండటంతో అక్కడ హృదయవిదారక పరిస్థితి ఏర్పడింది.
ఒరోమియా స్థానిక ప్రభుత్వం సైతం.. ఈ దాడి ఒరోమో లిబరేషన్ ఆర్మీ పనేనంటోంది. అయితే.. ఈ ఆరోపణల్ని ఖండించింది ఓఎల్‌ఏ. తాము ఎలాంటి దాడులు చేయలేదంటున్నారు ఓఎల్‌ఏ తిరుగుబాటుదారులు. మరోవైపు మరోసారి దాడులు చేస్తారని భయాందోళన చెందుతున్నారు అమ్హారా తెగ ప్రజలు. తమను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com