Rishi Sunak : బ్రిటన్ గడ్డను భారతీయుడు ఏలడం కలగానే మిగిలిపోనుందా..?

Rishi Sunak : బ్రిటన్ గడ్డను భారతీయుడు ఏలడం కలగానే మిగిలిపోనుందా..?
Rishi Sunak : ఈసారి బ్రిటన్ ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా ఇండియాలో ఆసక్తి రేకిత్తిస్తున్నాయి

Rishi Sunak : ఈసారి బ్రిటన్ ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా ఇండియాలో ఆసక్తి రేకిత్తిస్తున్నాయి. ప్రధాని రేస్‌లోకి భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకురావడంతో.. భారత్‌లో ఏదో చిన్న ఎమోషనల్ మొదలైంది. మన ఇండియాను 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ గడ్డను మన భారత సంతతికి చెందిన వ్యక్తి రూల్ చేయబోతున్నాడనే వార్త.. భారతీయులందరికీ ఇంట్రెస్టింగ్‌గా కనెక్ట్ అయ్యింది.

ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎంపీల అనూహ్య మద్దతుతో రిషి సునాక్‌కు విజయావకాశాలు మెండుగా కనిపించాయి. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రిషిని వెనక్కి నెట్టి ముందుకొచ్చారు లిజ్‌ ట్రస్‌.. 60-40 శాతం రేటింగ్‌తో పైచేయి సాధించారు లిజ్‌ ట్రస్‌. ప్రస్తుతం 90 శాతం విజయావకాశాలు లిజ్ ట్రస్ కే ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.

రిషి సునాక్ మంచి ప్రచారకుడని చాలామంది అంచనా వేశారు, కానీ ట్రస్ ప్రదర్శనలు అంచనాలను అధిగమించాయని.. బెట్టింగ్ ఎక్స్చేంజ్ సంస్థ స్మార్కెట్ తెలిపింది. తాజా అంచనాలతో సునాక్ ప్రధాని అయ్యే అవకాశాలు 10 శాతానికి పడిపోయారని స్మార్కెట్ తెలిపింది.

కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతో పాటు సభ్యుల మద్దతు దక్కిన వారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. దీంతో వారి మద్దతు కోరేందుకు రిషి, ట్రస్‌ దేశమంతా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.

డిబెట్స్‌లో ట్రస్ ప్రసంగాలు అంచనాలను అధిగమించాయి. ట్రస్ ఎక్కువగా విద్యా రంగంలో సంస్కరణలను లక్ష్యంగా చేసుకుని ఆరు-పాయింట్ల ప్రణాళికను విడుదల చేసింది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇతర అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు యాక్సెస్‌ను విస్తృతం చేస్తానని చెప్పుకువచ్చింది.

బ్రిటన్‌ ప్రధాని పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్‌ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబర్‌ 2న సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్‌ 5న ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల సంఖ్య 1,75,000గా ఉంది. పార్టీలో ఎంపీల మద్దతు రిషికి ఉన్నా సభ్యుల్లో ఎక్కువమంది లిజ్‌ ట్రస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి.

ప్రధాని పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్అంగీరించారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని వెల్లడించారు రిషి సునాక్. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు.

Tags

Next Story