Rishi Sunak : 5వ రౌండ్‌లోనూ రిషి ఘన విజయం..

Rishi Sunak : 5వ రౌండ్‌లోనూ రిషి ఘన విజయం..
Rishi Sunak : బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్ మరో అడుగు ముందుకేశారు.

Rishi Sunak : బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్ మరో అడుగు ముందుకేశారు. బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో 137 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. వాణిజ్య శాఖ మంత్రి పెన్ని మోర్డాంట్‌ తక్కువ ఓట్లతో రేసు నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం రిషితో పాటు లిజ్‌ ట్రస్‌ మాత్రమే రేసులో ఉన్నారు.

బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ క్రమంగా పట్టుబిగిస్తున్నారు. బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లోనూ రిషి సునాక్‌ అత్యధిక మెజార్టీ సాధించారు. రిషి సునాక్‌ 137 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. లిజ్‌ ట్రస్‌ 113 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ప్రధాని పదవి రేసులో సునాక్‌తో పాటు బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మాత్రమే ఉన్నారు.

చివరిదైన రౌండ్‌లో లిజ్ ట్రస్‌తో రిషి తలపడనున్నారు. చివరి రౌండ్‌లో ప్రధాని అభ్యర్థిని లక్షా 60 వేల మంది అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకుంటారు. చివరి రౌండ్‌లో గెలిచిన అభ్యర్థిని సెప్టెంబర్‌ 5న ప్రకటిస్తారు. ఇలా కన్జర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించిన వారే బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.

ఐతే చివరి రౌండ్‌లో రిషి సునాక్‌ గట్టిపోటి ఎదుర్కొనున్నాడని సర్వే వెల్లడైంది. పార్టీ కార్యకర్తలైన టోరీ మెంబర్ల చేతుల్లో రిషి సునాక్‌ భవితవ్యం ఆధారపడి ఉన్నందువల్ల చివరి రౌండ్‌లో గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది. ఇటీవలి సర్వేల్లో టోరి మెంబర్స్ లిజ్‌ ట్రస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైతే..భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరోదేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. పోర్చుగల్ ప్రధానిగా గోవా మూలాలున్న ఆంటోనియా కోస్టా కొనవసాగుతున్నారు.

గయానా అధ్యక్షుడుగా ఇండో-గయానా ముస్లిం కుటుంబానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌ 2020లో బాధ్యతలు చేపట్టారు. మారిషస్ అధ్యక్షుడుగా భారత ఆర్యసమాజ్ హిందూ కుటుంబానికి చెందిన పృథ్వీరాజ్‌సింగ్ ఉన్నారు. సౌత్ అమెరికాలోని సురినామ్ అధ్యక్షుడుగా చంద్రికా ప్రసాద్ సంతోఖి ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ఉన్నారు.

Tags

Next Story