Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగేది అప్పుడే.. రష్యా ప్రకటన..

Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగేది అప్పుడే.. రష్యా ప్రకటన..
Russia: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యి నెలరోజులు దాటింది.

Russia: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం మొదలయ్యి నెలరోజులు దాటింది. ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యాభీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలన్నీ హస్తగతం చేసుకోవడంలో భాగంగా.. దాడులను తీవ్రతరం చేసింది రష్యా. క్షిపణిదాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌లోని చాలామంది ప్రజలకు ఆహారం, తాగునీరు, ఇంధనం సరఫరా నిలిచిపోయింది. అయితే ఉక్రెయిన్ ప్రజలకు రష్యా ఓ శుభవార్త చెప్పింది.

ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మామూలుగా మొదలయిన కొంతకాలం తర్వాత ఇది వరల్డ్ వార్‌కు దారితీస్తోంది అని కూడా భయపడ్డారు ప్రజలు. ఆ యుద్ధం చాలా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపింది. ఉక్రెయిన్ నుండి ఎగుమతి, దిగుమతి ఆగిపోవడంతో చాలా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. అయితే వీటన్నింటికి త్వరలో చెక్ పడనుంది.

మే 9న యుద్ధాన్ని ఆపేయాలని రష్యా నిర్ణయించిందట. రష్యా దళాలకు ఇప్పటికే ఆ ప్రభుత్వం ఈ సమాచారం అందించినట్టు ఉక్రెయిన్ దళాలు అంటున్నాయి. మే 9 నాజీ జర్మనీపై రష్యా విజయం సాధించిన రోజు కాబట్టి అదే రోజు యుద్ధాన్ని విరమించాలని రష్యా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story