Sniper Wali: ఉక్రెయిన్‌కు అండగా 'స్నైపర్' వాలి.. మోస్ట్ డెడ్లీయెస్ట్‌‌గా పేరు..

Sniper Wali (tv5news.in)

Sniper Wali (tv5news.in)

Sniper Wali: వాలి. ఇంటి పేరు స్నైపర్. ప్రపంచంలో ఇలాంటి షార్ప్ షూటర్ లేనే లేడు.

Sniper Wali: వాలి. ఇంటి పేరు స్నైపర్. ప్రపంచంలో ఇలాంటి షార్ప్ షూటర్ లేనే లేడు. ఒకానొక యుద్ధంలో మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును సైతం నేలకూల్చాడు. ఇదేం ఆషామాషీ కాదు. బుల్లెట్‌ మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించడం గొప్ప విషయం కాదు. కాని మూడున్నర కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తికి గురిపెట్టడం, టార్గెట్ మిస్‌ అవ్వకపోవడం గ్రేట్.

స్నైపర్‌ రోజుకు ఐదారు మందిని హతమార్చడమే గొప్ప. గ్రేట్ స్నైపర్లు రోజుకు పది మందిని చంపగలరు. కాని, వాలి మాత్రం 40 మందిని చంపగలనని చెబుతున్నాడు. యుద్ధంలో ఎంతో మంది పోరాటం చేస్తుంటారు. కాని, వాలి అడుగుపెట్టిన ప్రతి చోట సెన్సేషన్ సృష్టిస్తాడు. తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. ఈ స్నైపర్‌ కెనడియన్‌ రెజిమెంట్‌లో పనిచేశాడు.

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ తరపున పోరాడాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ సాయం కోరాడు. జెలెన్‌స్కీ పిలుపుతో ఉక్రెయిన్‌ తరపున పోరాడడానికి మార్చి 4వ తేదీన మరో ముగ్గురు కెనడా సోల్జర్స్‌తో కలిసి ఉక్రెయిన్ వచ్చాడు. ఈ కెనడియన్ ఫైటర్‌కి 40 ఏళ్లు. కేవలం ఫైటర్ మాత్రమే కాదు.. వాలి ఒక కంప్యూటర్ సైంటిస్ట్ కూడా. వచ్చే వారం తన కొడుకు మొదటి పుట్టినరోజు ఉన్నా సరే.. యుద్ధానికి వచ్చాడు.

గతంలో కెనడా తరపున సిరియా, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఇరాక్‌ యుద్ధంలో పాల్గొన్న వాలీ.. 2017 జూన్‌లో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్‌ మోసుల్‌ను మూడున్నర కిలోమీటర్ల దూరం నుంచి కాల్చి చంపాడు. ఇదే ఇప్పటి వరకున్న రికార్డ్. 2009-2011 మధ్య కాందహార్‌ ఆపరేషన్స్‌లో కెనడా తరపున విధులు నిర్వహించాడు.

వాలి అనేది నిజమైన పేరు కాదు. ఆఫ్ఘనిస్తాన్లు ఇతనికి ఆ పేరు పెట్టుకున్నారు. అరబిక్ భాషలో వాలి అంటే సంరక్షకుడు లేదా ఆపద్బాంధవుడు అని అర్థం. ఆఫ్ఘనిస్తాన్‌లో పోరాడుతున్న సమయంలో పదుల సంఖ్యలో శత్రువుల్ని చంపేశాడు. అందుకే ఆ పేరు పెట్టుకున్నారు. నిజానికి వాలి అసలు పేరు ఏంటన్నది టాప్ సీక్రెట్‌గా ఉంచారు.

ఉక్రెయిన్‌లో అడుగు పెట్టిన స్నైపర్ వాలీ.. పని ప్రారంభించాడు. ఇప్పటికే ఆరుగురు రష్యన్‌ సోల్జర్స్‌ను హతమార్చాడు. ఉక్రెయిన్ ప్రజలు యూరప్‌తో కలవాలనుకుంటున్నారని, రష్యన్ ఏలుబడిలో రష్యన్లుగా ఉండకూడదని భావిస్తున్నారని కామెంట్ చేశాడు. అందుకే ఉక్రెయిన్ల తరపున పోరాడేందుకు వచ్చానని తెలిపాడు వాలి.

Tags

Read MoreRead Less
Next Story