Ukraine Russia: ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. కాల్పుల విరమణపై కుదరని ఒప్పందం!

Ukraine Russia: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగుతోంది. ఐతే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయానికి చేరువలో ఉన్నామని..యుద్ధం కీలక దశకు చేరుకుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని ముఖ్యనగరాలే లక్ష్యంగా వారం రోజులుగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి మాస్కోబలగాలు. ఓ వైపు చర్చలు జరుపుతూనే దాడులకు తెగపడుతోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆంక్షలకు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రష్యా సైన్యం మరింత దూకుడు పెంచింది.
ఇప్పటికే త్రిముఖ వ్యూహం అమలు చేస్తూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్కాసేనలు...మరింత దగ్గరకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రష్యా బలగాలు కీవ్‌కు మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అటు రష్యా సైన్యం భారీ కాన్వాయ్‌తో కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు దూసుకపోతోంది.
ఉక్రెయిన్‌పై దాడి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రష్యా 775 క్షిపనులను ఫైర్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. సాధారణ పౌరులే ఆయుధాలతో కీవ్ నగరాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చినట్లు కీవ్ మేయర్ తెలిపారు. అటు రష్యా కొత్త తరహా అటాక్ ప్రారంభించింది. పశ్చిమ ప్రాంతాలను తాజా దాడుల్లో టార్గెట్ చేసింది. పశ్చిమ ప్రాంతంలోని లుస్క్, ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరాలపై మిసైల్ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్- రష్యా సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగానే.. మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలు భేటీ అయ్యారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు టర్కీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా.. ఇరు దేశాల మంత్రులు ఈ కీలక చర్చలకు అంగీకరించారు. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి.. ఇదే మొదటి అత్యున్నత స్థాయి సమావేశంగా భావిస్తున్నారు.
అటు ఉక్రెయిన్-రష్యాయుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంధన ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com