ఇంగ్లీష్, హిందీలోనే CRPF రిక్రూట్‌మెంట్..గుర్రుమంటున్న దక్షణాది

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తుండడంపై మరోసారి దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఐతే.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
స్కిల్ టెస్ట్ కూడా ఇంగ్లీష్, హీందీలోనే ఉంటుందని తెలిపింది. దీంతో తమ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాది వారికి అనుకూలంగా కేంద్రం చర్యలు ఉన్నాయని మండిపడుతున్నాయి. గతంలోనూ ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి.. మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది నుంచి.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఇంగ్లీష్, హిందీతో పాటు.. 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని పేర్కొంది. ఐతే.. ఆ లోపే పోస్టులను హడావుడిగా భర్తీ చేస్తుండడంపై.. దక్షిణాది అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించే వరకు ఆగలేరా అని ప్రశ్నిస్తున్నారు. అప్పటి వరకు నోటిఫికేషన్లు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com