CBSE Board : ఇకపై 75% అటెండెన్స్ తప్పనిసరి: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం...

CBSE Board : ఇకపై 75% అటెండెన్స్ తప్పనిసరి: సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం...
X

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఇకపై బోర్డు పరీక్షలకు హాజరు కావాలంటే విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనను తక్షణమే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నేషనల్ అసైన్మెంట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల అసైన్‌మెంట్లను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో, విద్యార్థులందరూ తప్పనిసరిగా 75 శాతం హాజరు నిబంధన పాటించాలని సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, ఇటీవలే సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భద్రతపై కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది బోర్డు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, కనీసం 15 రోజుల ఫుటేజ్‌ను భద్రపరచాలని సూచించింది. పాఠశాలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేయాలని, అవి ఆడియో, వీడియో రెండింటినీ రికార్డ్ చేసేలా ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

Tags

Next Story