Vizag: వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్

Vizag: వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్
X

వైజాగ్‌కు మరో ప్రముఖ టెక్ కంపెనీ యాక్సెంచర్ రానుంది. నగరంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆ సంస్థ చూస్తున్నట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఎకరాకు 99పైసల చొప్పున పది ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే 12వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపింది. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో మరిన్ని టెక్ అనుబంధ సంస్థలు వచ్చే అవకాశముంది.కొవిడ్ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు బదులుగా విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తున్నాయి. తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉండటం, పోటీ జీతాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభించడం, ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉండటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. దీనికితోడు, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ బడా కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోంది. భారీగా ఉద్యోగాలు కల్పించే సంస్థలకు నామమాత్రపు ధరకే భూములు కేటాయిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించడం, ఆ హామీని అమలు చేస్తుండటంతో మరిన్ని కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి.

Tags

Next Story