Accenture : యాక్సెంచర్ ఎంప్లాయ్‌స్ కి బ్యాడ్ న్యూస్

ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. యాక్సెంచర్ ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్బర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్ లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com