ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఎంసెట్ ను మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.
మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు పీజీఈసెట్, జూన్ 13న ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పీఈసెట్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.
ఏపీ ఈఏపీసెట్ - మే 13 నుంచి 19 వరకు - జేఎన్టీయూ కాకినాడ
ఈసెట్ - మే 8 - జేఎన్టీయూ, అనంతపురం
ఐసెట్ - మే 6- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
పీజీఈసెట్ - మే 29 నుంచి 31 వరకు - శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
ఎడ్‌సెట్ - జూన్ 8 - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
లాసెట్ - జూన్ 9 - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
పీఈసెట్ - తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
పీజీసెట్ - జూన్ 3 నుంచి 7 వరకు - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ
ఏడీసెట్ (ఆర్ట్ అండ్‌డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -BFA/B.Design etc) - జూన్ 13 - డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కడప
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com