Group-1 : గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్

తెలంగాణలో గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన ఒక అభ్యర్థి ఈ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ సదరు అభ్యర్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
టీజీపీఎస్సీ అప్పీల్‌తో కలిపి విచారణ
ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసిందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ పరిణామంతో గ్రూప్-1 నియామక ప్రక్రియపై మళ్ళీ ఉత్కంఠ నెలకొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com