Layoffs : ఆగస్టులో 27 వేల మందిని ఇంటికి పంపిన టెక్ సంస్థలు
టెక్ సంస్థల్లో మరోసారి లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. గత నెలలో ఏకంగా 40 కంపెనీలు 27 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. లేఆఫ్స్ ప్రకటించిన సంస్థల్లో ఐబీఎం, ఇంటెల్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. కంప్యూటర్ చిప్‌లు తయారుచేసే ఇంటెల్ సంస్థ సుమారు 15 వేల మందిని ఆగస్టులో తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఇంటికి పంపించింది. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఈ లేఆఫ్‌లు చేపట్టింది. మరోవైపు నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ కూడా 6 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 7 శాతం తగ్గించుకుంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వృద్ధికి అవకాశం ఉన్న విభాగాలపై దృష్టిసారించడంలో భాగంగా ఈ తొలగింపులు చేపట్టింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com