Osmania University : హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల పరీక్షా తేదీల మార్పు

X
By - Manikanta |23 Nov 2024 4:00 PM IST
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల (బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించామని, పరీక్షలను అదే రోజు నుంచి నిర్వహిస్తున్నప్పటికీ, వివిధ పరీక్షా తేదీలను మార్చినట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com