Cognizant : ఫ్రెషర్లకు మంచి జీతమే ఇస్తున్నం.. కాగ్నిజెంట్ క్లారిటీ

Cognizant : ఫ్రెషర్లకు మంచి జీతమే ఇస్తున్నం.. కాగ్నిజెంట్ క్లారిటీ
X

ఫ్రెషర్లకు ఏడాదికి రూ.2.52 లక్షల జీతం ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతున్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆ జీతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కాదని తెలిపింది. సాధారణ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమేనని పేర్కొంది. బీటెక్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్లకు ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల జీతం అందిస్తున్నట్లు కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ కు శాలరీ హైక్ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ కొట్టిపారేసింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్‌ అని వివరించింది.

Tags

Next Story