DAO Results : డీఏవో ఫలితాల విడుదల
X
By - Manikanta |30 Nov 2024 9:30 PM IST
తెలంగాణలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులకు 1,06,253 మంది దరఖాస్తు చేశారు. తాజాగా మళ్టీ జోన్-1, 2 వారీగా ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in సందర్శించవచ్చు. రాష్ట్రంలో 53 DAO పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 30 నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com