Dell Layoffs : డెల్లో 12,500 మంది ఉద్యోగుల తొలగింపు

Dell Layoffs : డెల్లో 12,500 మంది ఉద్యోగుల తొలగింపు
X

ఏఐపై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా తమ కంపెనీ నుంచి 12,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డెల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఈ మేరకు ఉద్యో గులకు డెల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తెలియజేసిన ట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకేసారి 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. భవిష్యత్ అవసరాల కోసం ఏఐపై దృష్టి పెడుతున్నామని కంపెనీ పేర్కొంది. ఏఐ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కస్ట మర్లకు అందించటమే తమ ఉద్దేశమని చెప్పింది. ఈ క్రమంలోనే మార్కెటింగ్, ఇతర కస్టమర్ సర్వీస్ విభాగాల్లోని 12 వేల 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు మెమో జారీ చేసింది. మార్కెట్ టీంలను పునర్వ్యవ స్థీకరించి పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తు న్నట్లు పేర్కొంది. డెల్ గత సంవత్సరం రెండు రౌండ్లలో 13,000 ఉద్యోగాల ను తగ్గించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 1,33,000 నుంచి 1,20,000కి తగ్గించింది.

Tags

Next Story