Flipkart : ఫ్లిప్‌కార్ట్ లో లక్ష ఉద్యోగాలు.. బిగ్ బిలియన్ డేస్ ఎఫెక్ట్

Flipkart : ఫ్లిప్‌కార్ట్ లో లక్ష ఉద్యోగాలు.. బిగ్ బిలియన్ డేస్ ఎఫెక్ట్

వాల్ మార్కు చెందిన ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. పండగల సీజన్ వేళ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లక్ష ఉద్యోగాలు సృష్టించబోతున్నట్లు బుధవారం నాడు ఒక ప్రకటనలో ఫ్లిప్ కార్డ్ తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ కోసం కొత్తగా 9 నగరాల్లో కొత్తగా 11 పుల్ ఫిల్ మెంట్ సెంటర్లు ప్రారంభించామని, వీటితో కలిపి ఈ సంఖ్య 83కు చేరినట్లు తెలిపింది. దేశ సామాజిక ఆర్ధిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్ చైన్ విభాగంలో లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

పండగ ల సీజన్లో ఫ్లిప్ కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు, స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని పేర్కొంది. మహిళలు, దివ్యాంగులు ఎల్జీబీటీ ప్లస్ కమ్యూనిటీకి చెందిన వారినీ నియమించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకునే వీరికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సాధారణంగా పండగల సీజన్లో ఇ-కామర్స్ సంస్థలు ప్రకటించే ఉద్యోగాలు సీజనల్ గా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ తరహా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటాయి. ఇలా నియామించుకునే వారిని గిగ్ వర్కర్స్ గా వ్యవహరిస్తారు. ఇలా ప్రత్యేక సేల్స్, పండుగల సీజన్ వంటి సందర్భాల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని హ్యాండిల్ చేసేందుకు అనువుగా పెద్ద సంఖ్యలో గిగ్ వర్కర్లను ఇ-కామర్స్ సంస్థలు నియమించుకుంటున్నాయి.

Tags

Next Story