Prabhas Kalki : కల్కి సినిమాపై గరికపాటి విమర్శలు

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి సినిమా వచ్చి నెలలు దాటుతోంది. అయితే తాజాగా ఈ మూవీ కంటెంట్ పై ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు విమర్శలు చేయడం విశేషం. మరి ఈ విమర్శలు ఎప్పుడు చేశాడో కానీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జూన్ 27న విడుదలైన కల్కి బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థాముడుగా నటించాడు. ప్రభాస్ ను కర్ణుడి పాత్రలోరాబోయే భాగంలో చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అర్జునుడుగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అయితే ఈ మూవీలో కర్ణ పాత్రే అందరికంటే గొప్పది అన్నట్టుగా చూపించాడు నాగ్ అశ్విన్. తను మాయా బజార్ లాగా ఒక ఫిక్షన్ ను అడాప్ట్ చేసుకున్నాను అని రిలీజ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు దర్శకుడు. అయినా గరికపాటి చేసిన విమర్శలు అందుకు భిన్నంగా ఉండటం విశేషం.
ఇంతకీ గరికపాటి చేసిన విమర్శ ఏంటంటే.. ‘‘కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించినవాడే కర్ణుడు.. మనమేం చేస్తాం. సినిమా వాళ్లు ఏం చూపిస్తే అదీ.. మొత్తం భారతంలో ఉన్నది వేరు.. అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంట్ గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లైపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా.. బుర్ర పాడైపోతుంది. పైగా భారతం చదివితే అర్థం అవుతుంది.. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు.. కర్ణుడు ఒక్కసారి కూడా అశ్వత్థామను కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహా వీరుడు. ఇతనేమో.. ఆచార్య పుత్రా ఆలస్యమైనదా అని పెట్టారు డైలాగ్.. ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే.. ఒక వెయ్యి రూపాయలు ఎక్కువిస్తాం అంటే డైలాగ్ రాసేవాడు రాసేత్తాడు కదా..’’.. అంటూ తనదైన శైలిలో వ్యంగంగా కల్కి సినిమాపై కమెంట్స్ చేశాడు గరికపాటి నరసింహారావు.
విశేషం ఏంటంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అతన్ని బూతులు తిడుతూ కమెంట్స్ పెడుతున్నారిప్పుడు. పైగా గరికపాటికే అస్సలేం తెలియదట. అలా ఉంది వ్వవహారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com