Engineering Students : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్

రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వరకు కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్‌ఈ తదితర బ్రాంచీల నుంచి 7 వేల సీట్లు, అదనపు సీట్లతో కలిపి కొత్తగా 20,500 సీట్లు అందుబాటులోకి రావాలి. ఇందుకు ఏఐసీటీఈ కూడా ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కౌన్సెలింగ్‌లో 2,600 సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9 వేల సీట్లు మంజూరు చేస్తున్నది. వీటికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. ఇక తొలివిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 75,200 మందికి బీటెక్ సీట్లు వచ్చాయి. వీళ్లు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. ఈ గడువులో దాదాపు 55 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మిగతా 20 వేల మంది సీట్లు వదులుకున్నారు. అయితే వీళ్లలో చాలామంది మేనేజ్‌మెంట్ కోటాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com