Banks Posts : నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఆ బ్యాంకుల్లో...

Banks Posts : నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఆ బ్యాంకుల్లో...
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ స్థాయిలో రిక్రూట్ మెంట్ కి సిద్ధమయ్యాయి. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు. బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి.. 21 వేల మంది ఆఫీసర్ విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉండనున్నాయి. కేవలం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోనే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది. ఇక మిగతా బ్యాంకుల వివరాల గురించి తెలియాల్సి ఉంది. 2025 మార్చి నాటికి ఈ బ్యాంకుల్లో 2,36,226 మంది పని చేస్తున్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్లుగా ఉన్నట్లు సమాచారం. ఇంకేం ఉంది నిరుద్యోగులు.. ప్రిపరేషన్ కి సిద్దమవ్వండి..

Tags

Next Story