Highest Salary : అత్యధిక వేతనం పొందుతున్న సీఈవో ఎవరో తెలుసా?

భారత్ లోని ఐటీ కంపెనీల సీఈవోల్లో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న వారెవరో తెలుసా..? HCL టెక్నాలజీస్ సీఈవో సి. విజయ కుమార్. ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 10.06 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.84.16 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు.
ఆ ఏడాదికి ఐటీ సర్వీసెస్ కంపెనీ సీఈవోల్లో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తి ఆయనే కావడం విశేషం. హెచ్సీఎల్ టెక్ వార్షిక నివేదిక 2023-24 ప్రకారం.. విజయ్కుమార్ అందుకుంటున్న వేతనం గత ఏడాదితో పోల్చితే 190.75 శాతం పెరిగింది. ఆయన వేతన ప్యాకేజీలో.. బేస్ శాలరీ రూ.16.39 కోట్లు, పెర్ఫామెన్స్ లింక్డ్ బోనస్ రూ.9.53 కోట్లు, లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ రూ.19.74 కోట్లు ఉన్నాయి. రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ కింద రూ.38.15 కోట్లు పొందుతుం డగా.. మిగతా మొత్తాన్ని ఇతర ప్రయోజనాల కింద కంపెనీ అందిస్తోంది.
విజయ్ కుమార్ వేతనం సగటు ఉద్యోగుల జీతం కంటే 707.6 రెట్లు ఎక్కువ. మూలవేతనం విషయానికొస్తే.. ఆయన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ (మొత్తం వేతనం దాదాపు రూ. 66 కోట్లు), విప్రో కొత్త సీఈవో శ్రీని పల్లియా (మొత్తం వేతనం దాదాపు రూ.50 కోట్లు), టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ (మొత్తం వేతనం దాదాపు రూ.25 కోట్లు)ల కంటే ఎక్కువ పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com