IDBI: ఐడిబిఐ లో 500 మేనేజర్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

బ్యాంక్ ఉద్యోగం కావాలనుకుంటున్నారా.. ఈ వార్త మీకోసమే. IDBI బ్యాంక్ లో ఉద్యోగ నోటిఫికేష్ పడింది. 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అప్లికేషన్లు కోరుతోంది. ఫిబ్రవరి 12 నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 26లోగా అప్లికేషన్లు పెట్టుకోవాలని బ్యాంక్ కోరుతోంది. మార్చి 17, 2024న పరీక్ష రాయాల్సి ఉంటుంది.
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక సమాచారం కింద తెలుసుకోండి.
IDBI రిక్రూట్‌మెంట్ 2024 :
మొత్తం పోస్టులు 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. అభ్యర్థుల కనీస వయస్సు 20 ఏళ్లు. 25 ఏళ్లకు మించరాదు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అటెండ్ కావాలి. దరఖాస్తు ఫీజు SC / ST / PWD వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.200, ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ.1000.
www.idbibank.inని విజిట్ చేయండి. హోమ్ పేజీలో, కెరీర్‌ల లింక్ పై క్లిక్ చేసి.. తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫారమ్ ను ఫిల్ చేయండి. ఫీజు చెల్లించి.. డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి. ఆ తర్వాత ప్రింట్ ఔట్ తీసుకోండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com