Income Tax : టాక్స్ పేయర్లకు భారీ అలర్ట్.. ఏప్రిల్ 1, 2026 నుంచి మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.

Income Tax : దేశంలోని పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వనుంది. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో సరికొత్త ఆదాయపు పన్ను చట్టం 2026ను తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రూపొందించిన డ్రాఫ్ట్ కాపీని ప్రభుత్వం ఇటీవల ప్రజల ముందు ఉంచింది. ఈ మార్పుల వల్ల మీ శాలరీ స్లిప్, ట్యాక్సబుల్ ఇన్కమ్ లెక్కలు పూర్తిగా మారిపోనున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టంలోని ప్రధాన 10 మార్పుల గురించి తెలుసుకుందాం.
ప్రధాన మార్పులు ఇవే
ముఖ్యంగా రిటైర్మెంట్ ఫండ్స్ అయిన పీఎఫ్, ఎన్పీఎస్ లలో కంపెనీ వాటా 7.5 లక్షల రూపాయలు దాటితే, దానిపై వచ్చే వడ్డీతో సహా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ ఇచ్చే ఉచిత నివాస సదుపాయం పైన పన్ను లెక్కలు సిటీ జనాభా ఆధారంగా మారుతాయి. 40 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో శాలరీలో 10 శాతం పన్నుకు అర్హమైనదిగా పరిగణిస్తారు. ఇక కంపెనీ ఇచ్చే కారుపై ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఫిక్స్‌డ్ ట్యాక్సబుల్ వాల్యూని నిర్ణయించారు.
చిన్న చిన్న ప్రయోజనాలపై కూడా నిఘా
కంపెనీ ఇచ్చే గిఫ్టులు లేదా వోచర్లు ఏడాదికి 15 వేల రూపాయలు దాటితే వాటిపై పూర్తి పన్ను చెల్లించాలి. ఆఫీసు పని వేళల్లో కంపెనీ ఇచ్చే ఉచిత భోజనం ఒక్కో మీల్ రూ. 200 దాటితే అది పన్ను పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా కంపెనీ నుంచి మీరు వడ్డీ లేని రుణాలు తీసుకుంటే, రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది కానీ, ఆ పైన ఎస్బీఐ వడ్డీ రేట్ల ఆధారంగా ట్యాక్స్ లెక్కిస్తారు.
డిజిటల్ ట్రేడ్, ఇన్వెస్ట్ మెంట్స్
విదేశీ డిజిటల్ కంపెనీలకు కూడా ఈ చట్టం షాక్ ఇచ్చింది. భారతీయ వినియోగదారులతో రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు జరిగితే అవి ఇక్కడ పన్ను కట్టాల్సిందే. అలాగే మీరు సంపాదించే పన్ను రహిత ఆదాయం పై అయ్యే ఖర్చులను లెక్కించడానికి కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు. పెట్టుబడి సగటు విలువలో 1 శాతాన్ని ఖర్చుగా పరిగణిస్తారు. ఈ కొత్త నిబంధనల వల్ల మధ్యతరగతి ఉద్యోగుల పన్ను భారం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ట్యాక్స్ పేయర్లు ఇప్పటి నుండే తమ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లను మార్చుకోవడం ఉత్తమం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
