Infosys : ఇన్ఫోసిస్ మూర్తిని సంపదలో దాటేసిన పార్ట్‌నర్

Infosys : ఇన్ఫోసిస్ మూర్తిని సంపదలో దాటేసిన పార్ట్‌నర్
X

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను నారాయణమూర్తితో పాటు మరో ఆరుగురు కలిసి స్థాపించిన సంగతి చాలామందికి తెలుసు. ఇన్ఫీ వ్యవస్థాపకుల్లో నారాయణమూర్తినే అందరి కంటే ధనవంతుడన్న అభిప్రాయం ఉంది. అయితే ఇది వాస్తవం కాదని తెలుస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గోపాలకృషన్ వ్యవస్థాపకుల్లో అందరి కంటే ధనవంతుడు.

టెక్ వర్గాల్లో గోపాలకృష్ణన్ అలియాస్ క్రిష్ అందరికీ సుపరిచితులే. హరూన్ ఇండియా సంస్థ 2024 ధనవంతుల జాబితాను ఈ మధ్యే ప్రకటించింది. దీంట్లో క్రిష్ కు సంపద డీటెయిల్స్ తెలిశాయి. హురూన్ తాజాగా ప్రకటించిన హరూన్ నివేదికలో బెంగళూర్లోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబం చోటు దక్కించుకుంది.

రూ.36,800 కోట్లతో మూర్తి ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. 38,500 కోట్లతో గోపాలకృష్ణన్ ఈ జాబితాలో వీరి కంటే ముందున్నారు. ఐఐటీ మద్రాస్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసిన ఆయన ఇన్ఫీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నారు. 2007 నుంచి 2014 వరకు ఇన్ఫోసిస్ కు సీఈఓ, ఎండీగా, వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు క్రిష్.

Tags

Next Story