Infosys : ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. Infosysలో 55,000 ఉద్యోగాలు..!

Infosys : ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. Infosysలో 55,000 ఉద్యోగాలు..!
Infosys : 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 55,000 ఉద్యోగావకాశాలు కలిపిస్తామని NTLF ఈవెంట్‌లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ వెల్లడించారు.

Infosys : ప్రముఖ ఇటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 55,000 ఉద్యోగావకాశాలు కలిపిస్తామని NTLF ఈవెంట్‌లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 55,000 మంది ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకుంటామని త్వరలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. ఫ్రెష‌ర్స్‌కు ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ ఉంటుంద‌ని తెలిపారు. అయితే వారు త‌క్కువ కాలంలో నూత‌న నైపుణ్యాలు నేర్చుకుంటే కెరీర్ బాగుంటుంద‌ని అన్నారు. వచ్చే ఏడాది మరింత ఎక్కువమందిని రిక్రూట్ చేసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story