Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్తగా 20వేల ఉద్యోగాలు

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్తగా 20వేల ఉద్యోగాలు
X

కొత్తగా 20వేలమందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఇన్ఫీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియామకాల్ని చేపడతామని సంస్థ పేర్కొంది. తాజా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3,15,332గా ఉంది. ఇప్పుడు నిన్న (గురువారం) ప్రముఖ ఐటీ సంస్థ, టీసీఎస్ తర్వాత రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ కూడా మొదటి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. నికర లాభం 7.10 శాతం పెరిగి రూ. 6368 కోట్లకు చేరింది. అయితే ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా.. మార్చి క్వార్టర్‌తో చూస్తే మాత్రం 20 శాతం వరకు పడిపోయింది. అయినప్పటికీ అంచనాల్ని మాత్రం మించింది.ఇదిలా ఉండగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40 వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకోనుంది. ఇప్పటికే Q1లో దాదాపు 11 వేల మంది ట్రైనీలను చేర్చుకుంది.

Tags

Next Story