JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాలు రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు పొందుపరిచారు. పేపర్ 1 పరీక్షలు 2024 జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా.. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది. దేశవ్యాప్తంగా పేపర్-1కు 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,24,945 మంది పురుషులు.. 4,06,920 మంది మహిళలు.. 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇక.. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ షెడ్యూల్ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. సెషన్-2కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాలను https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com