JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్స్ట్ రిలీజ్.. స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్స్ట్ రిలీజ్.. స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అవుతున్నాయి. ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచుతారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఈ పరీక్ష నిర్వహించారు. 2 వారాల్లోనే ఈ పరీక్ష ఫలితాలు వస్తున్నాయి.

పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫలితాల తర్వాత కటాఫ్ మార్కులు ఎలా ఉండబోతున్నాయనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది. పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని ఏజెన్సీ ఇప్పటికే రిలీజ్ చేసింది. అది చూసి మార్కులపై ఓ అంచనాకు వచ్చేశారు అభ్యర్థులు.

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష ఫలితాలను jeemain.nta.ac.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. లాగిన్ అయి స్కోర్ కార్డు, ఇతర వివరాలను చూడొచ్చు. ntaresults.nic.in వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. రీవాల్యుయేషన్ కు చాన్స్ ఉండదు. ప్రతిభ ఆధారంగా జేఈఈ మెయిన్ టాపర్ల జాబితాను తయారు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story