JNTUH : జెఎన్ టియు లో పీ ఎచ్ డి అడ్మిషన్స్

JNTUH : జెఎన్ టియు లో  పీ ఎచ్ డి అడ్మిషన్స్

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) (JNTU) పీహెచ్‌డీ (Ph.D) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా... 2024-25 నాటికి పీహెచ్ డీ అడ్మిషన్లు (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్) కల్పిస్తారు. ఇంజినీరింగ్ (Engineering), సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology), మేనేజ్‌మెంట్ సైన్సెస్ (Management Sciences) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 220 సీట్లను ఇప్పుడు భర్తీ చేయనున్నారు.

ముఖ్య వివరాలు:

యూనివర్సిటీ - జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTU), హైదరాబాద్

కోర్సులు - డాక్టరేట్‌లో ప్రవేశాలు

విభాగాల్లో ఖాళీలు: IT 62, మెకానిక్స్ 36, విద్యుత్ 25, సివిల్ 4, ECE 18, మెటలర్జీ 8, బయోటెక్నాలజీ 6, కెమిస్ట్రీ 10, పర్యావరణం 4, గణితం 8, నానోటెక్నాలజీ 3, భౌతిక శాస్త్రం, నీటి వనరులు 4, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ 6.

అర్హతలు: డిగ్రీ, పీజీతోపాటు నెట్ అర్హతతోపాటు జీప్యాట్, గేట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

దరఖాస్తు రుసుము: పూర్తికాల కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వారు రూ. 1500 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2024.

జరిమానాతో దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: మార్చి 7, 2024.

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, JNTU, కూకట్ పల్లి, హైదరాబాద్ - 500085

అధికారిక వెబ్‌సైట్: https://jntuh.ac.in

Tags

Next Story