Jobs : అసంతృప్తితో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ.. కొత్త రిపోర్ట్

Jobs : అసంతృప్తితో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ.. కొత్త రిపోర్ట్
X

దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 మంది వారు చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తి గా ఉన్నారని హ్యాపీయస్ ప్లేసెస్ నివేదిక తెలిపింది. ఒకే వయస్సులో ఉన్నప్పటికీ వ్యక్తులు వివిధ స్థాయిల్లో ఆనందాన్ని అనుభవిస్తున్నారని, పని సంస్కృతి, పర్యావరణం, వ్యక్తిగత పరిస్థితులు వంటి అంశాలు కార్యాలయ సంతృప్తిని ప్రభావి తం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. సంతోషాల స్థాయిల్లో భౌగోళిక, స్త్రీ, పురుషుల్లో అసమానతలు ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మహిళలు ఎక్కువ మంది తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

నార్త్ రీజియన్లో పురుష ఉద్యోగులు కూడా తాము చేస్తున్న ఉద్యోగం పట్ల ఎక్కువ మంది సంతృప్తికరంగా ఉన్నారు. వివిధ పరిశ్రమలు, ఫిన్టిక్ సంస్థల్లో పని చేస్తున్నవారిలో ఎక్కువ మంది సంతోషంగా ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం 50 శాతం మంది ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగం మారాలని భావిస్తున్నారు. వ్యక్తిగతంగా సంతృప్తికరంగా లేకపోవడం, వ్యవస్థల నుంచి సరైన మద్దతు లేకపోవడం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. మంచి సపోర్ట్ ఇచ్చే పరిస్థితులు, వ్యక్తిగత ఇష్టాలు వంటి కారణాలతో 60 శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసేందుకు ఇష్టపడడం లేదు.

మిలీనియల్స్ ఎక్కువగా ఉద్యోగ మార్పులకు గురవుతారు. 59 శాతం మంది ఉద్యోగం మారేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. 63 శాతం ఉద్యోగులు సంఘర్షణల కారణంగా టీమ్ వర్క్ లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 62 మంది మంది ఉద్యోగులు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు భయపడ్డారని నివేదిక తెలిపింది.

Tags

Next Story