TG DSC : తెలంగాణలో మొదలైన మెగా డీఎస్సీ రాతపరీక్షలు

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డీఎస్సీ, రాతపరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చేనెల ఐదో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం,సీబీఆర్టీ లో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సారిగా డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. డీఎస్సీ రాతపరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు రోజూ రెండు విడతల్లో రాతపరీక్షలను నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం తొమ్మిది నుంచి 11.30 (స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యు కేషన్ మినహా,గంటల వరకు జరుగుతుంది. రెండో విడత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 (స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా) గంటల వరకు నిర్వహిస్తారు.
మొదటి విడతకు ఉదయం 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఉదయం 8.45 గంటలకు గేట్లను మూసేస్తారు.
రెండో విడతకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థు లకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1.45 గంటల కు గేట్లను మూసేస్తారు.
పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడతలో మధ్యా హ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్య ర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. డీఎస్సీ అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తారు. అందుకే పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థు లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com