Microsoft : మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్‌తో పీసీలు, ల్యాప్‌టాప్‌లు పలుమార్లు రీస్టార్ట్ అవుతున్నాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఫ్లైట్ సర్వీస్‌లన్నీ స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల్లోని విమానాలు ఆలస్యం అవడంతో పాటు కొన్ని రద్దు కూడా అయ్యాయి. ఢిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కొన్ని ఆన్‌లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్ సర్వీసుల్లో అంతరాయం కలుగుతుందని ఇండిగో, స్పైస్ జెట్ ప్రకటించాయి. దీంతో విండోస్‌లో సమస్యపై ‘ఎక్స్’ వేదికగా పోస్టులు యూజర్లు పోస్టులు పెడుతున్నారు. విండోస్‌లో సమస్య కారణంగా హైదరాబాద్‌లోనూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తమ బృందం సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తోందని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ సేవలు కొనసాగుతాయని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com