New Rent Rules : నెలకు రూ. 50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లించే వారికి బిగ్ అలర్ట్...కొత్త రూల్స్ వచ్చాయ్.

New Rent Rules : ఇంటి అద్దెకు సంబంధించిన విషయంలో అద్దెదారుల కష్టాలను తగ్గించడానికి, లావాదేవీలలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ 2025 ను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నియమాలు అద్దెదారులతో పాటు ఇంటి యజమానులకు కూడా స్పష్టత, భద్రతను అందించనున్నాయి. ముఖ్యంగా నెలకు రూ. 50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లించేవారికి TDS నిబంధనలలో మార్పులు వచ్చాయి. ఈ కొత్త రూల్స్‌ను పాటించకపోతే భారీ జరిమానాలు, వడ్డీ, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అద్దె ఒప్పందాల రిజిస్ట్రేషన్, అద్దె పెంచడం, రిపేర్లకు సంబంధించిన కొత్త నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.
అద్దెకు సంబంధించిన ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194-IB ప్రకారం ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఒక ఉద్యోగి, వృత్తి నిపుణుడు లేదా చిన్న వ్యాపారవేత్త నెలకు రూ.50,000 కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నట్లయితే, అతను 2% TDS తప్పనిసరిగా తీసివేయాలి. ఈ టీడీఎస్ను సంవత్సరానికి ఒకసారి మార్చి నెలలో లేదా అద్దె ఒప్పందం ముగిసే నెలలో కట్ చేసి ప్రభుత్వానికి చెల్లించాలి. అద్దెదారు ఫార్మ్ 26QC ను నింపి, ఇంటి యజమానికి ఫార్మ్ 16C ను అందించాలి. గత ఏడాది మీ వ్యాపారం టర్నోవర్ రూ.కోటి కంటే తక్కువగా ఉన్నా, లేదా వృత్తి ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువగా ఉన్నా కూడా ఈ TDS నిబంధన వర్తిస్తుంది.
టీడీఎస్ నియమాలను పాటించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. టీడీఎస్ ఆలస్యమైతే రోజుకు రూ. 200 లెట్ ఫీజు ఉంటుంది. టీడీఎస్ తీసివేయకపోతే 1% వడ్డీ, TDS జమ చేయకపోతే 1.5% వడ్డీ పడుతుంది. రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. తీవ్రమైన కేసుల్లో 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.
కొత్త నియమాల ప్రకారం, అద్దె ఒప్పందాలలో అద్దెదారుల భద్రత పెరగనున్నాయి.రెంట్ అగ్రిమెంట్ చేసుకున్న 60 రోజుల్లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్టర్ చేయకపోతే రూ.5,000 వరకు జరిమానా పడుతుంది. దీనివల్ల కాగిత రహిత, ఏకపక్ష అగ్రిమెంట్లు తగ్గుతాయి. ఇంటి యజమానులు అకస్మాత్తుగా అద్దె పెంచడానికి వీలులేదు. అద్దె పెంచడానికి 90 రోజుల ముందు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. పెద్ద నగరాల్లో అద్దెదారులను అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పేవారు. ఇప్పుడు, రెంట్ ట్రిబ్యునల్ ఆదేశాలు లేకుండా ఎవరినీ ఇల్లు ఖాళీ చేయించలేరు. సెక్యూరిటీ డిపాజిట్ పరిమితి కూడా నిర్ణయించబడింది.
ఇంటి యజమాని రిపేర్ లేదా పరిశీలన కోసం ఇంటికి రావడానికి 24 గంటల ముందు అద్దెదారుకు తెలియజేయాలి. అవసరమైన రిపేర్లు 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. లేదంటే, అద్దెదారు అద్దె తగ్గించుకోవచ్చు లేదా రిపేర్లు స్వయంగా చేయించుకుని, ఆ డబ్బును అద్దెలో సర్దుబాటు చేసుకోవచ్చు. అద్దె, డిపాజిట్, ఇల్లు ఖాళీ చేయించడం వంటి వివాదాలు 60 రోజుల్లోపు పరిష్కరించబడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

