Lab Technician : 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

X
By - Manikanta |12 Sept 2024 5:48 PM IST
ఆరోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను సర్కార్ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం బోర్డు కార్యదర్శి గోపి కాంత్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవంబర్ 10న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అభ్యర్ధులకు ఏవైనా అభ్యంతరాలు, తప్పిదాలు ఉంటే అక్టోబర్ 5 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com