స్పైస్‌జెట్‌లో 1400 మంది ఉద్యోగులు ఔట్!

స్పైస్‌జెట్‌లో 1400 మంది ఉద్యోగులు ఔట్!

ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది. ఖర్చులు తగ్గించుకునే కారణంతో సంస్థలోని 15 శాతం అంటే 1400 మంది తీసివేయనున్నట్లు సమాచారం. వీరిని తొలగించటం వల్ల సంస్థకు ఏటా రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం 9,000 మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం 40 విమానాలను నడుపుతోంది. వీటిలో పదింటిని లీజు కింద తీసుకుంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలే రూ. 60 కోట్ల వరకు అవుతోంది. చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్‌లైన్‌గా పేరొందిన స్పైస్‌జెట్గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతోంది.

సిబ్బంది వేతనాలు భారంగా మారాయని.. గతకొన్ని నెలలుగా వాటి చెల్లింపుల్లోనూ ఆలస్యమవుతోందని సమాచారం. జనవరి నెల వేతనం ఇప్పటికీ కొంతమందికి అందలేదని తెలుస్తోంది. సంస్థ ఖర్చులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సంస్థ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌సింగ్‌ గతనెల సీనియర్‌ అధికారులతో జరిపిన సమావేశంలో చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story