TCS : మళ్లీ టాప్‌లోకి టాటా.. దేశంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా టీసీఎస్

TCS : మళ్లీ టాప్‌లోకి టాటా.. దేశంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా టీసీఎస్
X

దేశంలోని అత్యంత విలువైన బ్రాండ్ గా టీసీఎస్ అవతరించింది. టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు అంటే.. రూ.4.17 లక్షల కోట్ల వరకు ఉంటుంది. దేశంలోని టాప్-75 అత్యంత విలువైన బ్రాండ్ల విలువ 19 శాతం వృద్ధి చెందినట్లు కంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. వాటి మొత్తం విలువ 450.50 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 38 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

మార్కెటింగ్ డేటా, విశ్లేషణకు సం బంధించిన కంటార్ బ్రాండ్జ్ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. భారతదేశం లోని ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వరుసగా మూడో సంవత్సరం అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచిందని నివేదిక వెల్లడించింది. దీని తర్వాత హెచిఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి.

కంటార్ బ్రాండ్జ్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ యొక్క బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లు. గతేడాది కంటే ఇది 16 శాతం పెరిగింది. భార తీయ కరెన్సీలో దీని విలువ రూ. రూ.4.17 లక్షల కోట్లు ఉంటుంది. బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణం ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు రంగంలో పెట్టుబడి, అని కంటార్ బ్రాండ్జ్ నివేదికలో పేర్కొంది.

Tags

Next Story