TCS : టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ పన్ను డిమాండ్ నోటీసులు పంపింది. సుమారు 30 నుంచి 40 వేల మందికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. టీడీఎస్(ట్యాక్స్ డిడక్టర్ ఎట్ సోర్స్)లో తేడాలు ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ ఆయా నోటీసుల్లో పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు వల్ల టీడీఎస్‌కు సంబంధించి వివరాలు ఆదాయపు పన్నుశాఖ పోర్టల్‌లో సరిగా అప్‌డేట్ కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదికి పన్ను చెల్లింపుదారులు చెల్లించిన టీడీఎస్‌కు ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో ఐటీ చట్టం సెక్షన్ 143 (1)కి లోబడి ఈ నెల 9న ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు రావాల్సిన రిఫండ్లు సైతం నిలిపివేసినట్లు సమాచారం.ఐటీ శాఖ నోటీసులపై స్పందించిన టీసీఎస్.. అంతర్గతంగా ఉద్యోగులకు సమాచారం చేరవేసింది. ఈ నోటీసులకు స్పందించి ఎలాంటి చెల్లింపులూ చేయొద్దని సూచించింది. సంస్థ నుంచి తదుపరి సూచనలు వచ్చేంతవరకు ముందుకెళ్లొద్దని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com